News January 9, 2026

మెక్సికో డ్రగ్స్ ముఠాలపై నేరుగా దాడి చేస్తాం: ట్రంప్

image

మెక్సికో నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయని ట్రంప్ అన్నారు. దీని వల్ల ఏటా వేలాది మంది అమెరికన్ పౌరులు మరణిస్తున్నారని తెలిపారు. పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందన్నారు. మెక్సికోను పూర్తిగా డ్రగ్స్ ముఠాలు నడుపుతున్నాయని ఆరోపించారు. దీన్ని అడ్డుకునేందుకు వారిపై నేరుగా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. సరిహద్దుల్లో చొరబాట్లు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News February 22, 2026

కరెంటు సమస్యలా? ఈ నంబర్‌కు HI అని మెసేజ్ చేయండి

image

TGSPDCL వాట్సాప్ చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. 8712441912 నంబర్‌కు HI అని మెసేజ్ చేసి పలు సర్వీసులను పొందవచ్చు. కంప్లైంట్స్‌ రిజిస్టర్, కంప్లైంట్ ట్రాక్, బిల్ వివరాలు, పవర్ సప్లై స్టేటస్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సమస్యపై ఏజెంట్‌తో చాట్ చేయొచ్చు. 24/7 ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
#ShareIt

News February 22, 2026

భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం MOU

image

AP: భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, CM CBN సమక్షంలో MOU జరిగింది. MOUపై భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ అందించే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నట్లు CM వెల్లడించారు. రాష్ట్రంలోని 13,426 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News February 22, 2026

బుల్లెట్ తగిలినా తగ్గలేదు!

image

జమ్మూకశ్మీర్ కిష్త్వార్ జిల్లాలో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో టైసన్ అనే శునకం ధైర్యసాహసాలు ప్రదర్శించింది. దాని సహాయంతో పోలీసులు, భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రమూకలను గుర్తించగలిగారు. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో టైసన్ గాయపడింది. అయినా ఓర్పుతో మిషన్ పూర్తయ్యేవరకు సేవలు అందించింది. గాయపడిన శునకాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.