News February 20, 2025

‘మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి’

image

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, అమరావతి ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలులోని సంస్థ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ ఏర్పాటయ్యే పరిశ్రమలలో స్థానిక యువతకే 75% ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జీవో తేవాలని కోరారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 21, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు 

image

➤ కర్నూలులో తొలి జీబీఎస్ కేసు నమోదు. ➤ ఎమ్మిగనూరులో మహిళా దొంగల హల్ చల్. ➤ ఈ నెల 23న గ్రూప్-2 పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ. ➤ తుగ్గలి వద్ద బస్సు బోల్తా. ➤ పెద్దకడబూరు: నకిలీ ఇల్లు పట్టాలు.. వ్యక్తిపై కేసు. ➤ జగన్‌కు Z+ భద్రత కల్పించాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్. ➤ గ్రూప్-2 అభ్యర్థుల కోసం 08518-277305 హెల్ప్ డెస్క్ నంబర్. ➤ ఏపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా చల్లా వరుణ్. 

News February 21, 2025

గ్రూప్-2 అభ్యర్థుల అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్‌

image

గ్రూప్-2 అభ్యర్థుల సౌలభ్యం కోసం కర్నూలు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కర్నూల్ కలెక్టరేట్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు టోల్ ఫ్రీ 08518-277305 నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

News February 21, 2025

కర్నూలులో జీబీఎస్ కేసు.. వ్యాధి లక్షణాలు ఇవే!

image

☞ కాళ్లు, చేతులలో మంట, <<15529133>>తిమ్మిర్లుగా<<>> అనిపించడం
☞ నరాల బలహీనత, కండరాల నొప్పులు
☞ సరిగ్గా నడవలేకపోవడం, తూలడం వంటి లక్షణాలు
☞ నోరు వంకర పోయి మింగలేక ఇబ్బంది పడే పరిస్థతి
☞ చెమటలు ఎక్కువగా పట్టడం
☞ వ్యాధి తీవ్రత ఎక్కువైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

error: Content is protected !!