News November 16, 2025

మెట్‌పల్లి: ‘ఓపెన్ డిగ్రీ విద్యార్థులూ రెగ్యులర్ క్లాసులకు రావచ్చు’

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్ పొందిన విద్యార్థులు మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్‌గా జరుగుతున్న డిగ్రీ తరగతులకు సైతం హాజరుకావచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ కే.వెంకయ్య తెలిపారు. కాగా, కళాశాలలో ఉన్న అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ అధ్యయన కేంద్రంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఆదివారం క్లాసులు ప్రారంభించారు. కో-ఆర్డినేటర్ రాజేందర్, దశరథం, గంగాధర్ తదితరులున్నారు.

Similar News

News April 12, 2026

యుద్ధం.. ఇరాన్‌కు రహస్యంగా చైనా ఆయుధాలు?

image

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా ఉద్రిక్తతలు తగ్గడంలేదు. ఈ క్రమంలో చైనా రహస్యంగా ఇరాన్‌కు ఆయుధాలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోందని US నిఘా వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇరాన్ అందుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే తాము ఏ పక్షానికీ ఆయుధాలను అందించడం లేదని చైనా స్పష్టంచేసింది. నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ మండిపడింది.

News April 12, 2026

కృష్ణలంక: అయోధ్యకు వెళ్లి వచ్చేలోపు..!

image

కృష్ణలంకలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు కుటుంబంతో కలిసి అయోధ్యకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. నిఘా పెట్టిన పోలీసులు శనివారం ములకల నిరంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 11 కేజీల వెండి, 50 గ్రాముల బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు DCP కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

News April 12, 2026

IPL: ఢిల్లీ చెత్త రికార్డు

image

CSKతో మ్యాచ్‌లో <<19628621>>ఓడిన<<>> ఢిల్లీ క్యాపిటల్స్‌ IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అత్యధిక సార్లు(31) ఆలౌట్ అయిన జట్టుగా తన స్థానాన్ని మరింతగా ‘మెరుగు’పరుచుకుంది. ఈ లిస్టులో PBKS(27), RCB(26) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు చెపాక్ స్టేడియంలో ఢిల్లీతో ఆడిన 9 మ్యాచుల్లో 8 సార్లు CSK గెలిచింది. ఇదే స్టేడియంలో వరుసగా 6 ఓటముల తర్వాత చెన్నైని విజయం వరించింది.