News March 14, 2026

మెట్‌పల్లి: క్వింటాల్ పసుపు @13,524

image

మెట్‌పల్లి మార్కెట్‌లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ.13,524, కనిష్ఠం రూ. 9,009; పసుపు గోళ గరిష్ఠం రూ.12,222, కనిష్ఠం రూ. 8,808; పసుపు చూర గరిష్ఠం రూ.10,523, కనిష్ఠం రూ.8,686గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ రోజు మార్కెట్‌లో మొత్తం 1,024 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయన్నారు.

Similar News

News April 12, 2026

రేపు ప్రజా సమస్య పరిష్కార వేదిక: కలెక్టర్

image

పుట్టపర్తితో పాటు మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 12, 2026

తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

image

తిరుపతి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే సోమవారం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అర్జీలు తీసుకుంటామని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీదారులు తమ వివరాలు, పాత స్లిప్పులు తీసుకు రావాలని సూచించారు. 1100‌కు కాల్ చేసి ఫిర్యాదుల స్టేటస్ తెలుసుకోవచ్చని చెప్పారు. Meekosam.ap.gov.in ద్వారానూ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

News April 12, 2026

నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.