News September 10, 2025

మెట్‌పల్లి నుంచి RTC ప్రత్యేక TOUR

image

MTPL నుంచి ఈనెల 12న టూర్ ఏర్పాటు చేసినట్లు DM దేవరాజ్ తెలిపారు. బీదర్ స్వయంభూ వినాయక, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, హుమ్నాబాద్ మాణిక్ ప్రభు ఆలయం, గుల్బర్గా, గనుగాపూర్ దత్తాత్రేయ ఆలయం, అక్కలకోట స్వామి సమర్థ ఆలయం, పండరిపూర్, విట్టల్, తుల్జాపూర్, పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం, నాందేడ్ సిక్ గురుద్వార దర్శనమనంతరం తిరిగి 14న
బస్సు మెట్‌పల్లి చేరుకుంటుందన్నారు. ఛార్జీ రూ.4000. వివరాలకు: 9959225927.

Similar News

News September 10, 2025

సిద్దిపేట: ‘40 వేల మె.ట యూరియాకు.. 28 వేలే’

image

సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 4.87 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగులోకి వచ్చాయి. 40 వేల మె.ట యూరియా అవసరముండగా 28,882 మెట్రిక్ టన్నులే వచ్చింది. 20 రోజుల కిందటే వరికి యూరియా చల్లాల్సి ఉన్నా అన్నదాతలకు సరిపడే యూరియా దొరక్కపోవడంతో ఇంతవరకు చల్లలేదు. దీంతో పంట ఎదుగుదల లేక పిలకలు పెట్టక అలాగే అగిపోయింది. యూరియా కోసం రైతులు లైన్లో నిలబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఉంది.

News September 10, 2025

సిరిసిల్ల: కోడెల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం

image

కోడెల పంపిణీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈనెల 14న ఉదయం 9 గంటలకు వేములవాడ మండలం తిప్పాపూర్లోని గోశాలలో కోడెలను పంపిణీ చేస్తామని వివరించారు. ఆసక్తి గలవారు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https://rajannasircilla.telangana.gov.in/.

News September 10, 2025

ఈ వంట ఆడవారికి ప్రత్యేకం..

image

తమిళనాడులోని తిరునల్వేలిలో ఉళుందాన్‌కలి వంటకాన్ని స్త్రీలకోసం ప్రత్యేకంగా చేస్తారు. ఇది అమ్మాయిల ఎముకలను బలోపేతం చేసి హార్మోన్ల అసమతుల్యతను నివారిస్తుందని నమ్ముతారు. కప్పు మినప్పప్పు, బియ్యం కలిపి వేయించి, పిండి చేస్తారు. ఈ మిశ్రమానికి బెల్లం, నీరు చేర్చి ఉడికిస్తారు. తర్వాత నెయ్యి వేసి, పైకి తేలే వరకూ కలిపితే సరిపోతుంది. దీన్ని జాగ్రత్త చేస్తే నెల నుంచి రెండు నెలల వరకూ నిల్వ ఉంటుంది.