News February 26, 2026

మెట్‌పల్లి: పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

image

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం మొదటి పరీక్ష సందర్భంగా గురువారం మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నాపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News February 28, 2026

WGL: కాసేపట్లో నింగిలోకి ‘రుద్రమ-1’ రాకెట్

image

భద్రకాళి బండ్ వేదికగా ‘రుద్రమ-1’ మోడల్ రాకెట్‌ను శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రయోగించనున్నారు. 250 గ్రాముల బరువు, 4 అడుగుల ఎత్తు ఉన్న ఈ చిట్టి రాకెట్ శాస్త్ర సాంకేతిక రంగంపై ఆసక్తి ఉన్న వారిని ఆకట్టుకుంటోంది. ప్లాస్టిక్, బాల్సా ఉడ్, ఫైబర్ వంటి తేలికపాటి పదార్థాలతో దీనిని రూపొందించారు. ప్రయోగం తర్వాత ఇది సుమారు 3 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంటుందని అంచనా.

News February 28, 2026

‘గద్వాలను అభివృద్ధి పథంలో నడిపిద్దాం’

image

గద్వాల జిల్లా నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ, పౌర సేవలపై ఇరువురు అధికారులు చర్చించారు. అధికారులందరి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
అభివృద్ధి పథంలో నడిపిద్దాం

News February 28, 2026

ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.16,100
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,812
*వెండి 10 గ్రాముల ధర రూ.2,770 గా ఉంది.