News April 21, 2025
మెట్‌పల్లి: బాలుడి మృతి.. తండాలో విషాదం

MTPL(M) ASRతండాలో హరిప్రసాద్(12) మృతిచెందాడు. స్థానికుల ప్రకారం..పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో హరిప్రసాద్ 6వతరగతి చదువుతున్నాడు. పరీక్షలు ఐపోయాక శనివారం తండ్రి దేవేందర్ స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. బాలుడికి కడుపునొప్పి రావడంతో KRTLలో ఓ ఆసుపత్రిలో చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లాడు. ఆదివారం ఉదయం బాలుడు ఇంటివద్ద పడిపోవడంతో MTPL ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News April 21, 2025
వనపర్తి: మేడే ఉత్సవాలకు సిద్ధం కావాలి: విజయ రాములు

వనపర్తి జిల్లాలో మే 1న అంతర్జాతీయ కార్మిక దినం మే డేకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు ఒక ప్రకటనలో కోరారు. గ్రామాల్లో పార్టీ జెండాలు దిమ్మెలకు రంగులు వేసి ముస్తాబు చేయాలన్నారు. గ్రామ, మండల శాఖ సమావేశాలను పూర్తి చేయాలని, సమావేశాల్లో గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించాలని పేర్కొన్నారు.
News April 21, 2025
గొల్లపూడి పంచాయితీకి అవార్డు

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద జాతీయ పంచాయతీ అవార్డు-2025కు గొల్లపూడి పంచాయతీ ఎంపికైందని పంచాయతీరాజ్ శాఖ సంచాలకుడు కృష్ణతేజ సోమవారం తెలిపారు. సొంత ఆదాయ వనరుల అభివృద్ధి విభాగంలో ఈ పంచాయతీ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని ఆయన వెల్లడించారు.
News April 21, 2025
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం భద్రాచలంలోని ప్రఖ్యాత శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె కవిత గర్భగుడిలో కొలువై ఉన్న సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాముల వారి ఆశీస్సులతో TG రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను అని తెలిపారు.