News February 13, 2026
మెట్‌పల్లి: మూడవ రౌండ్‌లో విజయం సాధించిన అభ్యర్థులు వీరే

మెట్‌పల్లి మున్సిపాలిటీ వార్డుల్లో 3వ రౌండ్ విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇవే. 3వ వార్డు బత్తుల నరేశ్ కాంగ్రెస్, 6వ వార్డు బంగారుకాళ్ల నీరజ బీఆర్ఎస్, 9వ వార్డు బొడ్ల వసుధ బీజేపీ, 12వ వార్డు సుమయ్య తబస్సుం ఇండిపెండెంట్, 15వ వార్డు అరిగేలా అనూష బీజేపీ, 18వ వార్డు చెట్లపెల్లి మీనా, 21వ వార్డు ఖాజా అజీమ్ వొద్దిన్ ఇండిపెండెంట్ 24వ పూదరి జ్యోతి బీఆర్ఎస్ విజయం సాధించారు.
Similar News
News April 12, 2026
ఇరాన్, అమెరికా మధ్య ముగిసిన చర్చలు

పాక్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు ముగిశాయి. 14 గంటలపాటు డిస్కషన్స్ కొనసాగినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ‘నిపుణుల నివేదికలను ఇరుపక్షాల సాంకేతిక బృందాలు పరస్పరం మార్చుకున్నాయి. కొన్ని విభేదాలు మిగిలి ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయి’ అని ట్వీట్ చేసింది. అయితే ఏయే అంశాలపై చర్చించారు, వేటిపైన ఏకాభిప్రాయం కుదిరింది, ఇరాన్ కండిషన్లపై US స్పందనేంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
News April 12, 2026
IPL: నేడు డబుల్ మజా

IPLలో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30కు లక్నో వేదికగా LSG, గుజరాత్ తలపడనున్నాయి. ఈ జట్ల మధ్య జరిగిన ఏడు మ్యాచుల్లో GT 4, LSG 3 గెలిచాయి. ఇక 7.30కి ముంబై వేదికగా MI, RCB మధ్య హైఓల్టేజ్ పోరు ప్రారంభం కానుంది. 34 సార్లు ఈ టీమ్స్ తలపడగా, 19 విజయాలతో MIదే పైచేయిగా ఉంది.
News April 12, 2026
తూ.గో: 120 ఏళ్ల సామ్రాజ్యం కూలిపోయిందిలా..!

1448లో జరిగిన భీకర యుద్ధంలో గజపతి రాజు కపిలేంద్ర దేవుడు రాజమహేంద్రవరాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈ యుద్ధంతో ఆంధ్ర తీరప్రాంతలో సుమారు 120 ఏళ్ల రెడ్డి రాజుల పాలన అంతమైంది. రాజమహేంద్రవరానికి రక్షణ కవచంలా కాపాడే గోదావరిని దాటి మరీ గజపతులు విజయం సాధించడం అప్పటి యుద్ధ తంత్రాల పరాకాష్ట అని చరిత్రకారులు చెబుతారు. ఇది నగర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసిన ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది.


