News December 14, 2025
మెట్‌పల్లి: లండన్‌లో సివిల్ ఇంజనీర్ చదువు.. నేడు ఉప సర్పంచ్

మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి వార్డు మెంబర్‌గా పోటీ చేసి విజయం సాధించిన ఆకుల రాకేష్ (30)కు ఉప సర్పంచ్ పదవి వరించింది. లండన్‌లో సివిల్ ఇంజనీర్ చదివిన రాకేష్ స్వగ్రామ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే ఉప సర్పంచ్ పదవిని అలంకరించారు.
Similar News
News December 14, 2025
MDK: వరించిన అదృష్టం.. డ్రాలో సర్పంచ్ పదవి

మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్‌గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. కేతవత్ సునీత (కాంగ్రెస్), బీమిలి(బీఆర్ఎస్) ఇద్దరికి 182 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి, ఒకటి నోటకు పడింది. ఇద్దరికీ సమానంగా రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతవత్ సునీతకు విజయం వరించింది.
News December 14, 2025
జగిత్యాల: ఫైనల్ పోలింగ్ శాతం వివరాలు

జగిత్యాల జిల్లాలో రెండో విడతలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫైనల్ పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. బీర్పూర్ మండలంలో 80.25%, జగిత్యాల అర్బన్ మండలంలో 81.26%, జగిత్యాల రూరల్ మండలంలో 77.69%, కొడిమ్యాల మండలంలో 78.43%, మల్యాల మండలంలో 77.06%, రాయికల్ మండలంలో 79.11%, సారంగాపూర్ మండలంలో 77.61% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తంగా జిల్లాలోని ఏడు మండలాల్లో 78.34% ఓటింగ్ నమోదయిందన్నారు.
News December 14, 2025
చిత్తూరులో పెంపుడు కుక్కకు సమాధి

తమ కుటుంబంలో ఒకరిలా గారాబంగా పెంచుకున్నారు. వారితో పాటే అన్నం పెట్టారు. స్నానం చేయించారు. వారి మధ్యే నిద్ర కూడా పోనిచ్చేవారు. చివరికి తమని వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు. ఇంతకీ ఎవరిని అనుకుంటున్నారా! చిత్తూరు పట్టణంలోని గ్రీమ్స్ పేటలో ఓ పెంపుడు కుక్క స్టోరీ ఇది. అది చనిపోవడంతో దానిని మర్చిపోలేక సమాధి కట్టించాడు యజమాని. ఈ వింతను చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.


