News January 14, 2026

మెట్‌పల్లి: వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రఘు

image

వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మెట్‌పల్లికి చెందిన డాక్టర్ చిట్నేని రఘు నియామకం అయినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుమండ్ల మహేష్ బుధవారం తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడ అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా పలువురు అతనిని అభినందించారు.

Similar News

News March 29, 2026

NLG: బైక్ షోరూంకు రూ.1.75 లక్షల భారీ జరిమానా !

image

కొత్త బైక్ సరిగ్గా నడవకపోవడంతో బాధితుడికి న్యాయం చేస్తూ నల్గొండ వినియోగదారుల కమిషన్ కీలక తీర్పునిచ్చింది. చౌటుప్పల్‌కు చెందిన మల్లేష్ 2023లో కొన్న హీరో గ్లామర్ బైక్ మొరాయించడంతో షోరూం నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో ఆయన కమిషన్‌ను ఆశ్రయించగా.. బైక్ ఖరీదు రూ.1.35 లక్షలు, జరిమానా రూ.30 వేలు, కోర్టు ఖర్చులు రూ.10 వేలు కలిపి మొత్తం రూ.1.75 లక్షలు చెల్లించాలని హైటెక్ మోటార్స్‌ను కోర్టు ఆదేశించింది.

News March 29, 2026

అందం, ఆరోగ్యం.. కర్బూజతో సొంతం

image

ఎండా కాలంలో అధికంగా లభించే కర్బూజలో 95% నీరు, విటమిన్ A, C, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. ‘BP అదుపులో ఉండి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. చర్మంపై ముడతలు తగ్గి సహజమైన కాంతి వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News March 29, 2026

WGL: విద్యా ప్రదాతకు దక్కని గౌరవం!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యాసంస్థలు నెలకొల్పిన ఇటికాల మధుసూదన్ రావుకు తగిన గౌరవం లభించడం లేదు. మహబూబాబాద్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన సీఎం, పీఎం నెహ్రూను ఒప్పించి వరంగల్ నగరంలో నిట్, కేఎంసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు స్థాపించారు. ఏ విద్యాసంస్థలో కూడా కనీసం ఆయన స్మారకంగా విగ్రహం ఏర్పాటు చేయలేదు.
ఏ కళాశాలకు కూడా ఆయన పేరు పెట్టలేదు.