News September 10, 2025

మెట్‌పల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

JGTL(D) మెట్‌పల్లి శివారులోని వేంపేట్ రోడ్డులోని BC హాస్టల్ ముందు మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టాటా ACE, ద్విచక్రవాహనం ఢీకొనగా వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడిని వేంపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి నర్సయ్యగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 10, 2025

మెదక్: తొమ్మిది నెలల్లో 648 మంది సూసైడ్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 648 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 204, మెదక్‌లో 228, సిద్దిపేటలో 216 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.

News September 10, 2025

రాజాంలో రేపు జాబ్ మేళా

image

రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంతకుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా పీజీ చదివి వయసు 18-35లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు. 12 బహుళజాతి కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

News September 10, 2025

యువత ప్రాణాలు తీస్తున్న బ్రేకప్స్

image

దేశంలో బ్రేకప్‌‌ల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్‌లైన్ సంస్థ ‘వన్ లైఫ్’ తెలిపింది. అప్పులు, వైవాహిక సమస్యలు, నిరుద్యోగం, బెట్టింగ్, ఒత్తిడి, ఆర్థిక మోసాలతో మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నట్లు వివరించింది. తమ సంస్థకు ఏటా సగటున 23,000 కాల్స్ వస్తున్నాయంది. ఫోన్ చేసిన వారిపై సానుభూతి చూపిస్తూ కౌన్సిలర్లు వారిలో ధైర్యం నింపుతారని వివరించింది.
* ఇవాళ ఆత్మహత్యల నివారణ దినోత్సవం