News September 12, 2025

మెట్‌పల్లి: ‘షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి’

image

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునరుద్ధరించాలంటూ అఖిల పక్షం నాయకులు గురువారం మెట్‌పల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ, సీపీఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ, బీఆర్‌ఎస్, సమాజ్ వాదీ పార్టీ, బీసీవైసీ పార్టీల ప్రతినిధులు, చెరుకు రైతు సంఘం, రైతు సంఘాల ప్రతినిధులు, చెరుకు రైతులు పాల్గొని వివిధ తీర్మానాలు ఆమోదించారు. మోహన్ రెడ్డి, రాజేందర్, శ్రీనివాసరావు, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 3, 2026

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి

image

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ‘కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా టెహ్రాన్‌లోని ప్రభుత్వ లీడర్‌షిప్ కాంపౌండ్‌పై అటాక్ చేశాం. అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌, మిలిటరీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌పై బాంబులు వేశాం’ అని ఓ ప్రకటనలో IDF తెలిపింది.

News March 3, 2026

MDK: లవ్ ఫెయిల్.. యువతి ఆత్మహత్య!

image

మియాపూర్‌లో నివసిస్తున్న నర్సు (20) ప్రేమ విఫలమై హాస్టల్ గదిలో ఆత్మహత్మ చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లాకు చెందిన ఈమె స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుంది. ఏడాది కాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్న ఆమె, వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 3, 2026

అన్నమయ్య: యూట్యూబ్‌ చూసి బైక్‌ల చోరీలు..

image

పీలేరు మండలం పొంతలచెరువు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పోలీసులు నలుగురు అంతర్‌ జిల్లా బైక్ దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి అన్నమయ్య, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో చోరీ చేసిన రూ.40 లక్షల విలువైన 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. వాహనాలు రికవరీ చేసిన సిబ్బందిని అన్నమయ్య జిల్లా SP ధీరజ్ కునుబిల్లీ అభినందించారు.