News October 20, 2025

మెట్‌పల్లి: NOV 3న అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

అరుణాచలగిరి ప్రదక్షిణకు మెట్‌పల్లి డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును NOV 3న ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ దేవరాజు తెలిపారు. మ.2గ.లకు బస్సు బయలుదేరుతుందన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలానికి బస్సు చేరుకుంటుందని, 5న జరిగే గిరిప్రదక్షిణ అనంతరం జోగులాంబ, ముచ్చింతల దర్శనాల తర్వాత 6న రాత్రి బస్సు మెట్‌పల్లి చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.3,760 ఛార్జీ. 9959225927.

Similar News

News October 20, 2025

కామారెడ్డి: రోడ్లపై మృత్యు రాశులు

image

రైతుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలను పోతున్నాయి. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై పోలీసులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా రైతులు పెడచెవిన పెడుతున్నారు. ఈ నెల 18న కామారెడ్డి జిల్లా తాడ్వాయి PS పరిధిలో రోడ్డుపై ఆరబెట్టిన మొక్కజొన్న కుప్పపై బైక్ దూసుకెళ్లడంతో గంగారెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. రైతుల నిర్లక్ష్యంపై వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News October 20, 2025

మీరు కొన్న టపాసుల హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?

image

దీపావళి పిల్లలకు ఒక ఎమోషన్. దాచి పెట్టుకున్న డబ్బులతో పాటు పేరెంట్స్ వద్ద చిన్నపాటి యుద్ధం చేసైనా కావాల్సిన మనీ సాధించి టపాసులు కొనాల్సిందే. పండుగకు ముందు నుంచే రీల్ తుపాకులు, ఉల్లిగడ్డ బాంబులు కాలుస్తూ సంబరపడే బాల్యం దీపావళి రోజు తగ్గేదేలే అంటుంది. క్రాకర్స్ వెలుగుల్లో నవ్వులు చిందించే పిల్లల ముఖాలు చూసి పేరెంట్స్ సైతం మురిసిపోతారు. ఇంతకీ చిన్నప్పుడు మీరు కొన్న క్రాకర్స్ హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?

News October 20, 2025

బాపట్ల: GST ముగింపు సమావేశంలో కలెక్టర్ ఫ్యామిలీ

image

బాపట్ల టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ ముగింపు సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ ఆయన సతీమణి భూమిక చంద్రలాలి పాల్గొన్నారు. సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ.. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు చేపట్టిందన్నారు. జీఎస్టీ 4 స్లాబ్‌లు ఉన్న విధానాన్ని 2 స్లాబ్‌లకు తీసుకురావడంజరిగిందన్నారు.