News March 3, 2026

మెట్రో ఫేజ్-2 వారసత్వ కట్టడాల సవాలు

image

HYD మెట్రో ఫేజ్-2 విస్తరణలో పాతబస్తీ కారిడార్ ఇప్పుడు అధికారులకు పరీక్షగా మారింది. వారసత్వ కట్టడాల రక్షణపై హైకోర్టు నిబంధనలు కఠినంగా ఉండటంతో అలైన్‌మెంట్‌లో సాంకేతిక మార్పులు తప్పనిసరయ్యాయి. అటు L అండ్ T నుంచి ప్రాజెక్టు బాధ్యతల బదిలీపై ప్రభుత్వ కసరత్తు సాగుతుండగా ₹42,000 కోట్ల భారీ వ్యయంలో కేంద్రం 20% వాటాపై ఇంకా స్పష్టత రాలేదు. ట్రాఫిక్ డెన్సిటీ అంచనాలపై కేంద్రం కొర్రీలు వేస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 6, 2026

విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఎంతంటే?

image

విజయ్ దేవరకొండ-రష్మిక తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో 4 రోజుల వేడుకల నుంచి హైదరాబాద్‌లో రిసెప్షన్‌కు వరకు రూ.15-20 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి కోసం 3 కేజీల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు టాక్. వివాహ బాధ్యతను ఓ ప్రైవేట్ ఈవెంట్ సంస్థ చూసుకోగా, వీరి పెళ్లి వీడియోను నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News March 5, 2026

వనపర్తి జిల్లాలో ఘోర ప్రమాదం

image

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాలు.. ఏదుల నుంచి సంత/కూరగాయల మార్కెట్ ముగించుకొని 12 మందితో వెళ్తున్న ఆటో, రేవల్లి నుంచి వనపర్తికి వెళ్తున్న వరి పొట్టు ట్రాక్టర్‌ రెండు ఢీన్నాయి. ఈ ఘటనలో ఆటోలోని వెంకటయ్య(50) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను రేవల్లి, కోడేరు, పానగల్ అంబులెన్స్ ద్వారా వనపర్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు. మార్గమధ్యలో సుమిత్ర(42) చనిపోయారు.

News March 5, 2026

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

* గద్వాల: క్రీడా పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానం
* పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి: కలెక్టర్
* అలంపూర్: ఏళ్లు గడుస్తున్నా అందని డిగ్రీ విద్య
* రేపు శృంగేరి పీఠాధిపతి రాక
* ఇటిక్యాల: రైలు హాల్టింగ్ కోరుతూ ఎంపీకి వినతి
* ధరూర్: గడువులోగా ఎన్సీడీ స్క్రీనింగ్ పూర్తి చేయాలి
* అయిజ: ఇందిరమ్మ ఇళ్లకు ధరల సెగ
* మల్దకల్: విషాదం.. రైతు బలవన్మరణం