News March 8, 2025

మెట్ పల్లి: ఆరోగ్య సమస్యలతోనే నవవరుడు ఆత్మహత్య

image

మెట్‌పల్లి మండలం వెల్లుల్ల అనుబంధ గ్రామం రామచంద్రంపేటలో లక్కంపల్లి కిరణ్ అనే<<15688708>> నవ వరుడు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. రేపు అతని పెళ్లి జరగాల్సి ఉండగా ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా తమకు చెప్పలేదని పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని భావించి సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News September 14, 2025

గండికోటకు అవార్డు

image

న్యూఢిల్లీలో ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగిన బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్ (BLTM 2025)లో గండికోటకు ‘మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డు’ లభించింది. ‘భారతదేశపు గ్రాండ్ కేనియన్‌’గా ప్రసిద్ధి చెందిన గండికోటకు ICRT, భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించిన రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్‌లో ఈ అవార్డు లభించింది.

News September 14, 2025

అన్నమయ్య: ఇవాళ్టి బొప్పాయి ఎగుమతి ధరల నిర్ణయం

image

ఇవాళ టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ ధర కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు కలెక్టర్ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ ధరకు అమ్మే వ్యాపారులపై రైతులు ఫిర్యాదు చేయాలని, ఇందుకు కంట్రోల్ రూమ్ నంబర్లు 9573990331, 9030315951 లను సంప్రదించాలని ఆయన సూచించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

News September 14, 2025

368 పోస్టులకు RRB నోటిఫికేషన్

image

<>RRB <<>>368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు SEP 15 నుంచి OCT 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20-33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, దివ్యాంగులకు రూ.250. అభ్యర్థులను CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.