News August 14, 2025

మెట్ పల్లి: పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: మధుయాష్కి గౌడ్

image

BRS పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. మెట్ పల్లిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కోరుట్ల నియోజకవర్గంలో గతంలో తాను నిజామాబాద్ ఎంపీగా, కోరుట్ల ఎమ్మెల్యేగా రత్నాకర్ రావు ఉన్న హయంలో జరిగిన అభివృద్ధి తప్ప మళ్లీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగరావు, కృష్ణారావు తదితరులున్నారు.

Similar News

News August 14, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 14, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.43 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.42 గంటలకు
✒ ఇష: రాత్రి 7.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 14, 2025

IPL.. ఆ జట్టుకు బిగ్ షాక్

image

IPLలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు 2026 సీజన్‌కు ముందు బిగ్ షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి జహీర్ ఖాన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో మెంటార్‌ కంటే పెద్ద రోల్ మరొకరికి ఇవ్వాలని LSG ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరోవైపు జహీర్ ఖాన్ రోహిత్ శర్మను కలిసినట్లు ప్రచారం జరుగుతుండటంతో MI జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.