News February 15, 2025
మెడికల్ కళాశాల సందర్శించిన కలెక్టర్ దినేష్ కుమార్

అల్లూరి జిల్లా పాడేరు మెడికల్ కళాశాలను కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం సందర్శించారు. అనాటమీ, వయ కెమిస్ట్రీ, హిస్టాలజీ ల్యాబ్ బోధనా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో సామాజిక సేవ క్లబ్, సాంస్కృతి కార్యక్రమాల క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ 1 ఏప్రిల్‌లోను, బ్లాక్ 2 ఆగస్టు, బ్లాక్ 3 జూన్‌లోను పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.
Similar News
News December 14, 2025
NTR: సామాజిక మాధ్యమాల్లో తెలుగు తమ్ముళ్ల కొట్లాట.!

తిరువూరు నియోజకవర్గంలో MP, MLA వర్గీయుల మధ్య మరోసారి మనస్పర్ధలు భగ్గుమన్నాయి. MLA ఓ మండల అధ్యక్షుడిని ఉద్దేశించి “పేకాట క్లబ్ కింగ్” అని స్టేటస్ పెట్టగా, వ్యతిరేక వర్గం ఓ మహిళతో MLA సన్నిహితంగా ఉన్నట్లు ఒక ఫొటోను విడుదల చేసింది. ఇది AI ఫొటో అని, ఒరిజినల్ అని ఇరువర్గాలు వాట్సాప్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై MLA ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.
News December 14, 2025
ఖమ్మం జిల్లాలో ‘కిక్’ ఎక్కిస్తోన్న జీపీ ఎన్నికలు..!

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం మధ్య, గత 13 రోజుల్లో వైరా డిపో నుంచి రూ. 130 కోట్ల విలువైన 1.59 లక్షల కేసుల మద్యం, 56 వేల కేసుల బీర్లు తరలించారు. ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడంతో అటు వ్యాపారులకు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.
News December 14, 2025
బి.కొత్తకోట: జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది వీరే.!

పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని శనివారం బి.కొత్తకోట బాలికల హైస్కూల్‌లో మండల స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు జరిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. వ్యాసరచన పోటీల్లో మానస, వక్తృత్వ పోటీల్లో నవదీప్ రెడ్డి, క్విజ్ పోటీల్లో నవదీప్ రెడ్డి సత్తా చాటారని MEOలు రెడ్డిశేఖర్, భీమేశ్వరాచారి తెలిపారు. వీరు రాయచోటిలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొటారన్నారు.


