News December 24, 2025
మెడికల్ కాలేజీలపై PPPతోనే ముందుకెళ్లాలి: CM

AP: మెడికల్ కాలేజీలపై PPP విధానంతోనే ముందుకెళ్లాలని CBN వైద్యశాఖ సమీక్షలో స్పష్టం చేశారు. ముందుకొచ్చే వారికి VGF, ఇతర ప్రోత్సాహకాలూ ఇవ్వాలన్నారు. ‘ప్రీబిడ్‌లో 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. భూ వినియోగం, డిజైన్లలో స్వేచ్ఛ, కన్సార్టియం సభ్యుల సంఖ్య పెంపును అవి అడగ్గా అంగీకరించాం. ఆదోని కాలేజీ నిర్మాణానికి ఓ సంస్థ ఓకే అంది’ అని అధికారులు తెలిపారు. ఇతర సంస్థలనూ సంప్రదించాలని CM సూచించారు.
Similar News
News December 31, 2025
ESIC MC& హాస్పిటల్‌లో 95 పోస్టులు

<
News December 31, 2025
నిమ్మలో కలుపు ఉద్ధృతి తగ్గాలంటే..

నిమ్మ తోటలకు డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తే 25-30% కలుపు తగ్గుతుంది. చెట్ల పాదుల్లో వరి పొట్టు, ఊక, ఎండిన ఆకులు, వేరుశనగ పొట్టు, ఎండిన పంట వ్యర్థాలను వేస్తే అది మల్చింగ్‌గా ఉపయోగపడి కలుపు తగ్గుతుంది. అలాగే అవి మొక్కలకు ఎరువుగా ఉపయోగపడతాయి. 100 మైక్రాన్ల ప్లాస్టిక్ మల్చింగ్ షీటును కూడా వాడి కలుపును కట్టడి చేయొచ్చు. ఆక్సిఫ్లోరోఫిన్ మందును లీటరు నీటికి 1-1.5ML కలిపి చెట్ల పాదుల్లో పిచికారీ చేయాలి.
News December 31, 2025
యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు

హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూట్యూబర్ అన్వేష్(నా అన్వేషణ)పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైజాగ్‌లోనూ అన్వేష్‌పై <<18701726>>ఫిర్యాదు<<>> చేసిన సంగతి తెలిసిందే. అటు ఆయన ద్రౌపదిని ఉద్దేశించి RAPE అంటూ పోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.


