News February 1, 2026

మెతుకుసీమపై నిర్మలమ్మ కరుణ చూపేనా..?

image

నేటి కేంద్ర బడ్జెట్‌పై మెతుకుసీమ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రసాద్ పథకంలో ఏడుపాయల ఆలయానికి చోటు, కూడవెల్లి రామలింగేశ్వరస్వామి టెంపుల్‌కి నిధుల కేటాయింపు, జహీరాబాద్ నుంచి గజ్వేల్ మీదుగా ఔటర్ రింగ్ రైలుమార్గం, మెదక్- నర్సాపూర్-HYD 4లైన్ల రోడ్డు ప్రతిపాదనలకు ఆమోదం, నిమ్జ్‌కు నిధులు, సంగారెడ్డి, సిద్దిపేట స్మార్ట్ సిటీలకు ఈసారైనా భారీగా నిధులు కేటాయించాలని ఆశిస్తున్నారు.

Similar News

News February 8, 2026

కర్నూలులో రెసోనెన్స్.. సీమకు జాతీయ స్థాయి విద్య

image

రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కర్నూలులో ఫిబ్రవరి 7(శనివారం) ప్రారంభమైంది. కార్యక్రమానికి టీ.జీ. వెంకటేశ్, పద్మశ్రీ బ్రహ్మానందం, ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరై రెసోనెన్స్ 25 ఏళ్ల అకడమిక్ సేవలను ప్రశంసించారు. రాయలసీమ విద్యార్థులకు స్థానికంగా నాణ్యమైన విద్య, నిపుణుల మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన చదువు వాతావరణం లభిస్తే JEE/NEET వంటి పోటీపరీక్షల్లో గొప్ప విజయాలు సాధిస్తారని వారు తెలిపారు.

News February 8, 2026

ADB: తలకెక్కిన అభిమానం.. నెత్తిపై కారును ఎత్తుకున్నాడు

image

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీల కార్యకర్తలు తమ అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభిమాని ఆ పార్టీపై తనకున్న అభిమానాన్ని తలకెత్తుకున్నాడు. మాజీ మంత్రి జోగు రామన్న చేపట్టిన ప్రచారంలో ఓ అభిమాని ప్లాస్టిక్ కారును తలపై ఎత్తుకొని ప్రచారంలో పాల్గొని అందరిని ఆకర్షించాడు.

News February 8, 2026

KMR: పుర పోరులో ఇద్దరు విద్యార్థులు

image

కామారెడ్డి జిల్లాలో ఆయా మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.. గృహిణులు 97 మంది, వ్యాపారం చేసుకునేవారు 88, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నవారు 13, ఇతరాలు 69, ఏమీ వ్యక్తపరచనివారు 178 మంది ఉన్నారు. కాగా ఇద్దరు విద్యార్థులు బరిలో ఉంటూ పలువురు యువతకు ఆదర్శంగా నిలిచారు. పెళ్లయిన వారు 296 మంది, పెళ్లి కానివారు 14, ఏమీ వ్యక్తపరచనివారు 137 మంది పుర ఎన్నికల సమరంలో బరిలో దిగారు.