News April 3, 2024
మెదక్‌లో కాంగ్రెస్ గెలుపుపై సీఎం రేవంత్ ఫోకస్

మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమాయ్యారు. ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నాయకులు రాజిరెడ్డి, సుహాసిని రెడ్డి, హన్మంత్ రావు, నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిర్మల పాల్గొన్నారు.
Similar News
News April 19, 2025
మెదక్: అగ్నివీర్ దరఖాస్తులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువకుల నుంచి అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 21 నుంచి మే 11 వరకు అగ్నివీర్ వాయుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాలీ ఉంటుందన్నారు. http://agnipathvayu.cdac.inలో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు సికింద్రాబాద్‌లోని కమాండింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని (040-27758212) సంప్రదించవచ్చు.SHARE IT
News April 19, 2025
సిద్దిపేట: కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

కరెంట్ షాక్ తగిలి <<16142215>>విద్యార్ధి మృతి<<>> చెందిన ఘటన తోగుట(M)లో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. తుక్కాపూర్‌కు చెందిన చికుడ్క స్వామి గురువారం రాత్రి తన ఇద్దరి కుమారులతో కలిసి ఆలయం వద్దకు వెళ్లారు. గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ నిర్వహించేందుకు విద్యుత్ డెకరేషన్ ఏర్పాటు చేశారు. ఆ వైరు ఇనుప పైపునకు తగిలిఉంది. ప్రణీత్ ఆడుకుంటూ ఇనుప పైపునకు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.
News April 19, 2025
సిద్దిపేట: తల్లీ, కొడుకు అదృశ్యం.. కేసు నమోదు

తల్లీ, కొడుకు అదృశ్యమైన ఘటన జగదేవ్పూర్(M)లో జరిగింది. స్థానికుల వివరాలు.. దౌలాపూర్‌కు చెందిన లావణ్యను పదేళ్ల కింద గజ్వేల్(M) కొల్గురుకు వాసి కృష్ణతో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో లావణ్య చిన్న కొడుకుతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. గురువారం రాత్రి నుంచి లావణ్య కనిపించకపోవడంతో శుక్రవారం తండ్రి మల్లయ్య PSలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.