News August 29, 2025
మెదక్‌లో 8 మంది కామారెడ్డి విద్యార్థులకు పునరావాసం

కామారెడ్డి జిల్లాకు చెందిన 8 మంది విద్యార్థులు ఇటీవల మెదక్‌కు వచ్చి తిరిగి వెళ్లే సమయంలో భారీ వర్షాల కారణంగా పోచారం డ్యామ్ పొంగిపొర్లడంతో పోచమ్మరాల్ వద్ద చిక్కుకుపోయారు. 2 రోజులుగా అక్కడే నిలిచిపోయిన విద్యార్థులను గుర్తించిన రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో విద్యార్థులను హవేలీఘనాపూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర వసతి గృహానికి తరలించారు.
Similar News
News August 30, 2025
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మహబూబ్‌నగర్ కలెక్టర్

పాలమూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం డ్రై డే సందర్భంగా కలెక్టర్ విజయేందిర బోయి వివిధ కాలనీలను పరిశీలించారు. బీకే రెడ్డి కాలనీలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేకపోతే వైరల్ ఫీవర్ సోకే ప్రమాదం ఉందన్నారు.
News August 30, 2025
అభ్యంతరాలు ఉంటే తెలపాలి: వనపర్తి కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే MPDO దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జాబితా, వార్డులు, పోలింగ్ కేంద్రాల విషయంలో అవంతరాలు ఉంటే ఆయా మండలాల ఎంపీడీవో లదృష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
News August 30, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.