News February 12, 2025

మెదక్: అప్పులతోనే ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య

image

మెదక్ పట్టణంలో ప్రముఖ వ్యాపారి మల్లికార్జున రమేష్ (54) మంగళవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రమేశ్ పట్టణంలో ఓ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఈ సూపర్ మార్కెట్ ద్వారా 100 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారంలో అప్పులు రూ.కోట్లలో పేరుకుపోయాయి. వాటిని తీర్చే మార్గం లేక ఇంటిపై గల పెంట్ హౌస్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Similar News

News February 28, 2026

మెదక్‌లో సినిమా షూటింగ్ సందడి

image

చిన్నశంకరంపేట మం.జంగరాయి పరిసరాల్లో శివాని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘బుల్లెట్ బండి’ సాంగ్ షూటింగ్ సందడిగా జరిగింది. డైరెక్టర్ అరవింద్ దర్శకత్వంలో హీరో సంతోష్, నటులు అలీ గడ్డం, మహిపాల్, సుమిత్ర, అంజిరెడ్డి పాల్గొన్నారు. నిర్మాత శివాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చిత్రానికి మను కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రకృతి దృశ్యాల మధ్య జరుగుతున్న ఈ చిత్రీకరణను గ్రామస్థులు ఆసక్తిగా వీక్షించారు.

News February 28, 2026

MDK: హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి: అదనపు ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్‌లో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ గౌరవ వందనం స్వీకరించి సిబ్బందికి క్రమశిక్షణ, ఫిట్‌నెస్ ప్రాముఖ్యత వివరించారు. “Arrive Alive – 2026”లో భాగంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని, అతివేగమే ప్రమాదాలకు కారణమని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సేవలందించిన సిబ్బందిని అభినందించి, యువతలో రోడ్డు భద్రత అవగాహన పెంచాలని సూచించారు.

News February 28, 2026

మెదక్: ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మహిళలే!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్‌గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది. 2016లో ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు (మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట)గా విభజించిన విషయం తెలిసిందే.