News December 19, 2025
మెదక్: ‘అప్రమత్తతో ప్రాణ నష్ట నివారణ’

ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణత్యాగాలు నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. పకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ నిర్వాహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. 22న నిర్వహించే మాక్ ఎక్సర్సైజ్ విజయవంతం చేయాలని సూచించారు.
Similar News
News February 6, 2026
మెదక్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందాడు. మేడ్చల్ జిల్లా కొనాయిపల్లికి చెందిన గుంటి నవీన్ కూచారంలో అంత్యక్రియలకు హాజరై బైక్‌పై వెళ్తున్నాడు. కాళ్లకల్ మైకో కంపెనీ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 6, 2026
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు: ఎస్పీ

మద్యం మత్తులో జరిగిన గొడవలో వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. గడిపేద్దపూర్‌కు చెందిన మహేష్.. యాదయ్యపై కర్రతో దాడి చేసి చంపాడు. దీనిపై అలాదుర్గం పోలీసులు దర్యాప్తు చేసి సాక్ష్యాలను ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News February 5, 2026
మున్సిపల్ ఎన్నికలు.. 2వ విడత రాండమైజేషన్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది 2వ విడత రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల విధుల కోసం సిబ్బందిని ఎంపిక చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.


