News February 5, 2026

మెదక్: అర్ధరాత్రి మంత్ర పూజలు?

image

శివంపేట మండలంలోని అల్లీపూర్ గ్రామంలో నింగ బాలరాజ్, గోవర్ధన్ అనే అన్నదమ్ముల ఇంటి ముందు అర్ధరాత్రి జరిగిన అనుమానాస్పద పూజలు కలకలం రేపాయి. తెల్లవారుజామున ఇంటి ముందు మంత్ర పూజల గుర్తులు చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఎవరో కావాలనే భయపెట్టేందుకు ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

Similar News

News February 11, 2026

మెదక్: నేడు సెలవు మంజూరు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న వారందరికీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసిందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ ఉత్తర్వులతో ఉద్యోగులందరికీ ఓటు వేసే మార్గం సుగమమైంది.

News February 10, 2026

మెదక్: 686 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్త్: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలటీల పరిధిలో బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. 74 వార్డులు, 148 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 686 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 17 రూట్లలో మొబైల్ పార్టీ, సీఐల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్స్, నలుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేశామన్నారు.

News February 10, 2026

MDK: గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ ఓటు

image

మెదక్ మున్సిపాలిటీ గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ రాహుల్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు కలెక్టర్‌కు పోలింగ్ స్లిప్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ స్లిప్‌ల పంపిణీ కొనసాగుతోందన్నారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.