News August 13, 2025
మెదక్: అవార్డులలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు వినతి

జనవరి 26, పంద్రాగస్టు 15కు ఇచ్చే అవార్డులలో అవకాశం కల్పించాలని నాల్గవ తరగతి పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు సామ్యూల్, వెంకటేశం, మహమ్మద్ కురిషీద్, దుబా రాజమ్మ, సుజాతలు కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ వివిధ శాఖలో పనిచేసే సిబ్బందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తమను గుర్తించాలని కోరారు.
Similar News
News August 13, 2025
మెదక్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి వివేక్

మెదక్ జిల్లా కేంద్రంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకల కార్యక్రమంలో జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.
News August 13, 2025
‘మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మెదక్‌ను చేయాలి’

మెదక్‌ను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ నగేశ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. విద్యాశాఖ అధికారి రాధా కిషన్, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, జమల నాయక్, సీడీపీఓ హేమ భార్గవి ఉన్నారు.
News August 13, 2025
మెదక్: నషా ముక్త భారత్ అభియాన్

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం పురస్కరించుకొని మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. అదనపు ఎస్పీ మహేందర్, పోలీస్ అధికారులు, DPO సిబ్బంది పాల్గొన్నారు.