News June 30, 2024
మెదక్: ఆపరేషన్ ముస్కాన్‌పై ఎస్పీ సమీక్ష

మెదక్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డా.బాలస్వామి తెలిపారు. శనివారం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహణ గురించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న పిల్లల్ని ఎవరైనా వెట్టిచాకిరి గురిచేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో సమాజంలోని ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.
Similar News
News February 27, 2026
మెదక్: పరీక్షలకు 97.25% విద్యార్థులు హాజరు

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మొదటి సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగంలో 5,877 గాను 5,716 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 608 గాను 589 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో మూడవ రోజు హాజరు శాతం 97.25% గా నమోదైంది. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని డీఐఈవో మాధవి తెలిపారు.
News February 27, 2026
నర్సాపూర్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్‌లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తహశీల్దార్ శ్రీనివాస్, అధికారులున్నారు.
News February 27, 2026
మెదక్: నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరుకానున్నారు. ఈ మేరకు డీబీఎఫ్ (DBF) అధ్యక్షుడు దుబాసి సంజీవ్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అంబేడ్కర్ యువజన సంఘాలు, దళిత ప్రజా సంఘాల నాయకులు, అట్రాసిటీ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.


