News December 26, 2025
మెదక్: ఆరోగ్య సేవలు బలోపేతానికే తనిఖీలు: కలెక్టర్

ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం చిన్న శంకరంపేట మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పీహెచ్సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారని, మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలు అడిగితెలుసుకున్నారు
Similar News
News December 30, 2025
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామానికి చెందిన మల్లప్పగారి హేమంత్ సాయి (21) మృతిచెందినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. హేమంత్ సాయి శనివారం రాత్రి కుక్కదువు ప్రవీణ్ (20), మధ్యప్రదేశ్‌కు చెందిన కుల్దీప్‌తో కలిసి బైక్‌పై మేడ్చల్ బయలుదేరారు. మార్గమధ్యంలో ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో హేమంత్ సాయి మృతిచెందగా, ఇరువురు గాయపడ్డారు.
News December 30, 2025
మెదక్ జిల్లాలో పుష్కలంగా యూరియా: కలెక్టర్

మెదక్ జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ముందస్తు చర్యలతో ఇప్పటికే 12,673 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 7,343 మెట్రిక్ టన్నులు పంపిణీ కాగా ఇంకా 5,330 మెట్రిక్ టన్నులు నిల్వలో ఉన్నాయని వెల్లడించారు.