News February 16, 2025

మెదక్: ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

కౌడిపల్లి మండల కేంద్రంలోని PHCని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రోగుల గదులు, మందుల నిల్వ ఉండే గదులను పరిశీలించారు. రోగులతో సేవల గురించి ఆరా తీశారు. సేవలు బాగున్నాయా, ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డాక్టర్లు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని గతంలో ఒకసారి తనిఖీ చేసినపుడు సేవలు సరిగా ఉండేవి కావని గుర్తు చేశారు.

Similar News

News December 14, 2025

MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

image

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 14, 2025

MDK: 4 ఓట్లతో కనకరాజు విజయం

image

నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సునీతపై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వోజ్జ కనకరాజు 4 ఓట్లతో విజయం సాధించాడు. మండలంలో బీఆర్ఎస్ మొదటి విజయంతో ఖాతా ఓపెన్ చేయడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో గ్రామంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అభ్యర్థి తెలిపారు.

News December 14, 2025

మెదక్ జిల్లాలో రెండో విడతలో 88.80% పోలింగ్

image

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. చేగుంట, మనోరాబాద్, మెదక్, నార్సింగి, నిజాంపేట్, రామాయంపేట, శంకరంపేట (ఆర్), తూప్రాన్ మండలాల్లో పోలింగ్ నిర్వహించగా 88.80 శాతం నమోదైంది. మొత్తం 1,72,656 ఓటర్లలో 1,53,313 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి.