News March 23, 2025
మెదక్: ఇంటర్ విద్యార్థి MISSING

మెదక్ జిల్లా శివంపేట మండలం దంతాన్ పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. దంతాన్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల రేవంత్ కుమార్ (17) శనివారం పొలం వద్దకు వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్ఐ వివరించారు. మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి గొల్ల మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
ఏషియన్ పోటీలకు మెదక్ జిల్లా క్రీడాకారిణి ఎంపిక

ఏషియన్ అండర్ 15 మహిళల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి సాయి సిరి ఎంపికైనట్లు మెదక్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. జనవరిలో భారత జట్టు ఎంపిక ప్రక్రియలో సాయి సిరి ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల తైవాన్‌లో 26 నుంచి 30 వరకు జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనున్నారు.
News March 24, 2025
మెదక్: సైకిల్ పై వెళ్లి బస్టాండ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుంచి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్ పై వెళ్లి ఆదివారం రామయంపేట బస్టాండ్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రామాయంపేట బస్టాండ్‌లో శుభ్రతకు సంబంధించిన ఆర్టీసీ డీఎంకు పలు సూచనలు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను మహాలక్ష్మి పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. తనిఖీ చేసిన అనంతరం ఆర్టీసీ బస్సులో మెదక్‌కు చేరుకున్నారు.
News March 23, 2025
MDK: సీఎం బర్త్‌డే విషెస్.. ఎంపీ రిప్లై

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో, రాష్ట్ర ప్రజాపాలనలో భాగస్వాములు కావడానికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఎంపీ ట్విట్టర్ (X) ద్వారా స్పందిస్తూ.. సీఎంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.