News March 19, 2025
మెదక్: ఇండియా టుడే లో ఎంఈవోకు చోటు

తూప్రాన్ ఎంఈఓగా పనిచేస్తున్న పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణకు ఇండియా టుడే టాప్-10 పాయనీరింగ్ మైండ్స్ ఆఫ్ 2025లో చోటు దక్కింది. భారతదేశపు అత్యంత టాప్-10 ప్రభావశీలుర మార్గదర్శక వ్యక్తుల్లో సత్యనారాయణ చోటు దక్కడం పట్ల మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 19, 2025
మెదక్: భట్టి బడ్జెట్‌లో వరాలు కురిపిస్తారా..!

నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మెతుకుసీమ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి కేటాయింపులపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో నీటిని అందించే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆశలు పెట్టుకున్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో జాప్యం, పెండింగ్ పనులు, విద్యా, వైద్య రంగాల్లో అనిశ్చితి తొలిగేలా జిల్లాలో చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు.
News March 19, 2025
మెదక్ యువతకు GOOD NEWS

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మెదక్ జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో 1.55 లక్షల మంది యువత ఉన్నారు. ఏప్రిల్ 5 వరకు http:///tgobmmsnew.cgg.gov.in లో అప్లై చేసుకుంటే జూన్ 2 అర్హుల తుది జాబితా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో వెల్లడించనున్నారు. ఎంచుకునే యూనిట్‌ని బట్టి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు.
News March 19, 2025
మెదక్: యువకుడి సూసైడ్

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గరుగుల భాను(19) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.