News December 15, 2024

మెదక్: ఈనెల 25న ఉపరాష్ట్రపతి పర్యటన

image

కౌడిపల్లి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఉపరాష్ట్రపతి జగధీప్ ధన్కడ్ ఈనెల 25న కౌడిపల్లి మండలం తునికి శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి రానున్నారని తెలిపారు. విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.

Similar News

News March 7, 2026

మెదక్: ‘ప్రజా పాలన’ విజయవంతం చేయాలి: మంత్రి

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మెదక్ MLA క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. MLA రోహిత్ రావు, MP సురేష్ షెట్కర్, MLA సంజీవరెడ్డి, DCC అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్లతో కలిసి ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు.

News March 5, 2026

హవేలీఘనాపూర్: విద్యుదాఘాతంతో రైతు మృతి

image

హవేలీఘనాపూర్ మండలం బి. తిమ్మాయిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు ఎర్ర బిక్షపతి(42) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నాగమణి, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News March 5, 2026

‘పీఎం సూర్య ఘర్’తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలి: కలెక్టర్

image

ప్రజలు తమ గృహాలపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లో ‘పీఎం సూర్య ఘర్’ అవగాహన వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం జిల్లాలోని గ్రామాలు, మండలాల్లో పర్యటించి సౌర విద్యుత్ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.