News March 19, 2025
మెదక్: ఈ నెల 31 చివరి అవకాశం: కలెక్టర్

అనధికార లే అవుట్ ప్లాట్లు, లే అవుట్‌లను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఈనెల 31లోగా క్రమబద్ధీకరించి రుసుము చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మునిసిపల్ కార్యాలయలో నిర్వహిస్తోన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 22 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయన్నారు.
Similar News
News March 19, 2025
మెదక్: యువకుడి సూసైడ్

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గరుగుల భాను(19) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 19, 2025
మెదక్: ఇండియా టుడే లో ఎంఈవోకు చోటు

తూప్రాన్ ఎంఈఓగా పనిచేస్తున్న పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణకు ఇండియా టుడే టాప్-10 పాయనీరింగ్ మైండ్స్ ఆఫ్ 2025లో చోటు దక్కింది. భారతదేశపు అత్యంత టాప్-10 ప్రభావశీలుర మార్గదర్శక వ్యక్తుల్లో సత్యనారాయణ చోటు దక్కడం పట్ల మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
News March 18, 2025
మెదక్: టెన్త్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి

మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని వయోజన విద్యా శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఉషారాణిని నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.