News March 27, 2025
మెదక్: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ మండలంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. బిహార్‌లోని బాక్సర్ జిల్లా, సిమారికి చెందిన కమలేష్ కుటుంబంతో కలిసి కాళ్లకల్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య మమత ఇద్దరు పిల్లలు కలరు. వెల్డింగ్ వర్క్ చేసుకుంటా జీవనం కొనసాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News March 30, 2025
MDK: వన దుర్గమ్మను దర్శించుకున్న కలెక్టర్

ఉగాది పర్వదినం పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సకుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరి పేర వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగి సూర్య శ్రీనివాస్ జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు.
News March 30, 2025
జహీరాబాద్‌లో మహిళ దారుణ హత్య

మహిళ దారుణహత్యకు గురైన ఘటన జహీరాబాద్ పట్టణం పస్తాపూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. మహిళ కళ్లల్లో కారం చల్లి దారుణ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు ఝరాసంగం మండలం చీల మామిడికి చెందిన లక్ష్మి (55)గా గుర్తించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సందర్శించి హత్యకు గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు.
News March 30, 2025
మెదక్: ‘తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు’

మెదక్ జిల్లాలో నేటి నుంచి జూన్ 1 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ అధికారి మాట్లాడుతూ.. సెలవులలో తరగతులు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.