News April 25, 2024

మెదక్: ఎండలతో ప్రచారం కష్టమే..

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 25 వరకు గడువు ఉంది. 29న ఉపసంహరణ ఘట్టం ముగియగానే ప్రచార పర్వం మరింత పుంజుకుంటుంది. ఇప్పటికైతే ప్రచారానికి కేవలం 19 రోజులు మాత్రమే మిగిలింది. మే 13న పోలింగ్‌ జరుగుతున్న దృష్ట్యా ఒకరోజు ముందుగా అంటే మే 11న ప్రచార కార్యక్రమాలు ముగించాలి. ఈ కాస్త సమయంలో గ్రామగ్రామాన పర్యటించడం, ఎండలు మండిపోతుండడంతో అభ్యర్థులకు సవాల్‌గా మారింది.

Similar News

News September 11, 2025

మెదక్: కళాశాలను సందర్శించిన కలెక్టర్

image

మెదక్ పట్టణంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర హాస్టల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులపాటు ‌జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అవుతుందని ‌వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు మూడు రోజులపాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News September 11, 2025

బీఆర్ఎస్వీ నాయ‌కుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి: హ‌రీశ్‌రావు

image

గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో చిక్క‌డ‌ప‌ల్లి సెంట్రల్ లైబ్రరీ, ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులు, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News September 11, 2025

మెదక్: మొత్తం ఓటర్లు= 5,23,327 మంది

image

మెదక్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్క తేలింది. బుధవారం సాయంత్రం తుది జాబితా ప్రకటించారు. 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలుండగా 1052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య వెల్లడించారు. జిల్లాలో 2,51,532 మంది పురుషులు, 2,71,787 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారని, మొత్తం 5,23,327 మంది ఓటర్లున్నారని వివరించారు.