News April 25, 2024
మెదక్ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక కౌన్సిలర్ నామినేషన్

మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య నామినేషన్ దాఖలు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలల్లో ఏఐఎఫ్‌బీ పార్టీ తరుపున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు. గెలిచిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ మెదక్ ఎంపీగా నామినేషన్ వేయడం పట్ల పార్టీలో చర్చనీయాంశమైంది.
Similar News
News September 11, 2025
మెదక్: కళాశాలను సందర్శించిన కలెక్టర్

మెదక్ పట్టణంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర హాస్టల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు మూడు రోజులపాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News September 11, 2025
బీఆర్ఎస్వీ నాయకులను వెంటనే విడుదల చేయాలి: హరీశ్‌రావు

గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులు, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
News September 11, 2025
మెదక్: మొత్తం ఓటర్లు= 5,23,327 మంది

మెదక్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్క తేలింది. బుధవారం సాయంత్రం తుది జాబితా ప్రకటించారు. 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలుండగా 1052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య వెల్లడించారు. జిల్లాలో 2,51,532 మంది పురుషులు, 2,71,787 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారని, మొత్తం 5,23,327 మంది ఓటర్లున్నారని వివరించారు.