News March 29, 2024

మెదక్ ఎంపీ అభ్యర్థులకు పటాన్‌చెరు నేపథ్యం

image

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దిగుతున్న మూడు పార్టీల అభ్యర్థులు పటాన్‌చెరు నేపథ్యం కలిగి ఉన్నారు. మెదక్ పార్లమెంట్‌లో పటాన్‌చెరు నియోజకవర్గం ఒకటి కాగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు జర్నలిస్టుగా, న్యాయవాదిగా పనిచేయగా, కాంగ్రెస్ అభ్యర్థి చిట్కూల్ ఇటీవల సర్పంచ్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్‌ రామారెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్‌లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు.

Similar News

News September 8, 2025

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి దామోదర్

image

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ‌మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో పర్యటనకు రాగా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ రమాదేవి స్వాగతం పలికారు. బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. స్థానిక నాయకులు రమేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News September 8, 2025

మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం
చేగుంటలో యూరియా కోసం కోసం రైతులు రోడ్డు ఎక్కారు. గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. రామయంపేట పీఏసీఎస్ వద్ద క్యూ లైన్ లో రైతులు చెప్పులు పెట్టారు. శివ్వంపేట ప్రాథమిక సహకార సంఘం ముందు, నర్సాపూర్ రోడ్డుపై రైతులు ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

News September 8, 2025

చేగుంట: చెట్టును ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి

image

చేగుంట మండలం అనంతసాగర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట నుంచి బోనాల వైపు వెళ్తున్న ఒక కారు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రామాయంపేట మండలం శివాయపల్లికి చెందిన సాయితేజ్ (23) మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.