News March 25, 2024

మెదక్ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్ !

image

మెదక్‌ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసిన BRS.. నియోజకవర్గంలో తన కార్యాచరణను ప్రారంభించింది. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఒకటైన మెదక్‌‌పై కేసీఆర్ దృష్టిసారించారు. రేపటి నుంచి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యనేతలతో KCR సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటూ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన హరీశ్‌రావు.. మెదక్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.

Similar News

News December 22, 2025

మెదక్: నేడు కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం

image

మెదక్ జిల్లాలోని 492 గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. ఎన్నికలు జరగక నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఏర్పడింది. సుమారు రూ.50 కోట్లకుపైగా నిధులు రానుండటంతో పల్లె పాలన మళ్లీ గాడిలో పడనుంది.

News December 22, 2025

చిన్న శంకరంపేట: తాత హయాంలో నిర్మాణం.. మనుమడి హయాంలో హంగులు

image

చిన్నశంకరంపేట జీపీ సర్వంగ సుందరంగా ముస్తాబయింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రశేఖర్ తాత కంజర్ల శంకరప్ప రెండవసారి సర్పంచ్ గా పదవీలో కొనసాగుతున్నప్పుడు 01 నవంబర్ 1977 నాటికి గ్రామపంచాయతీ నిర్మాణం చేపట్టారు. ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి కోదాటి రాజమల్లు ప్రారంభోత్సవం చేశారు. తాత నిర్మాణం చేపట్టిన జీపీలో మనుమడు పదవి చేపట్టడం కొసమెరుపు.

News December 22, 2025

మెదక్: 492 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

image

మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు నిర్వహించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిని (ఆథరైజ్డ్ ఆఫీసర్) నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 492 గ్రామ పంచాయతీలకు ఆథరైజ్డ్ ఆఫీసర్లను నియమించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మొదటి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.