News August 16, 2024
మెదక్: ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు సెప్టెంబర్-11 వరకు గడువు

పేద విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ఎన్ఎంఎంఎస్ రాత పరీక్ష విధానంలో జాతీయ ఉపకార వేతనాలు అందిస్తోంది. ఉపకార వేతనాలు పొందడానికి 8వతరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. విద్యార్థులు bsc.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నకలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించాలి. ఎంపికైన విద్యార్థులకు 9-12వ తరగతి వరకు ఏటా12 వేల చొప్పున 48వేల ఉపకారవేతనం అందుతాయి.
Similar News
News February 4, 2026
మెదక్: అర్ధరాత్రి యాక్సిడెంట్!

శివంపేట్ మండలం పరిధిలోని పిల్లుట్ల గేట్ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో బైక్ తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో బైక్‌పై ఉన్న వ్యక్తి రోడ్డు పక్కనే పడిపోయి గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
News February 4, 2026
పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం: డీఈవో

విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని DEO విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన డీఈవో, చదువుపై పూర్తి దృష్టి సారించాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గనిర్దేశాన్ని పాటిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు.
News February 3, 2026
మెదక్: ఎన్నికల భద్రతపై డీజీపీ సమీక్ష

మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావుతో కలిసి పలు సూచనలు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ ఆదేశించారు. పోలీసులకు ఎన్నికల చట్టాలపై లీగల్ అవగాహన కల్పించి, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


