News December 14, 2025

మెదక్: ఎన్నికల నిర్వహణకు సహకరించండి: డీఎస్పీ

image

మెదక్ జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రజలు, సిబ్బంది సహకరించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. శనివారం చిన్నశంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 14, 2025

మెదక్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ నమోదు

image

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు సగటున 21.83 % పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా ఓటింగ్ శాతం ఇలా ఉంది. తూప్రాన్ 25.49 %, మనోహరాబాద్ 23.03 %, చేగుంట 19.52 %, నార్సింగి 18.04 %, రామాయంపేట్ 22.14 %, నిజాంపేట్ 18.56 %, చిన్నశంకరంపేట్ 20.85 %, మెదక్ 27.99 % పోలింగ్ నమోదైంది.

News December 14, 2025

మెదక్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్: అదనపు ఎస్పీ

image

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ తెలిపారు. చిన్నశంకరంపేటలో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలితో ఆత్మీయంగా మాట్లాడారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి, వృద్ధురాలికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా సహాయం అందించారు.

News December 14, 2025

మెదక్ జిల్లాలో నేడు పంచాయతీల ఎన్నికలు

image

మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుగానే 7 గ్రామ పంచాయతీలు, 254 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 142 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 1,034 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2News చూస్తూ ఉండండి.