News February 20, 2025
మెదక్: ‘ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి’

మెదక్ కలెక్టరేట్‌లో ఈ నెల 27న నిర్వహించే మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఎక్కా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎన్నికల విధులు నిర్వహించే వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల విధులను నిజాయితీ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News February 21, 2025
మెదక్: భర్తను హత్య చేసిన భార్య.. UPDATE

<<15507715>>భర్తను హత్య చేసిన<<>> భార్య శివమ్మ, అల్లుడు రమేశ్‌లను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్న పేటకు చెందిన ఆశయ్య ఈ నెల 15న పొలం వద్ద జారి పడగా కాలు విరిగింది. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు భరించలేక, ఆపరేషన్ చేసినా నడిచి పొలం పనులు చేయలేడనే అనుమానంతో భార్య, అల్లుడు ఆశయ్యను ఉరేసి హత్య చేశారు. కేసులో భాగంగా ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.
News February 21, 2025
MDK: వన దుర్గామాతను దర్శించుకున్న సినీహీరో

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతను ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు, నటుడు పూరీ ఆకాశ్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
News February 21, 2025
మెదక్: మైనర్ బాలికపై లైంగిక దాడి

మైనర్ బాలికపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంగారెడ్డి మండలం ఫసల్వాది పరిధిలోని రెండు పడక గదుల ఇళ్ల సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిది సంవత్సరాల పాపను ఇద్దరు పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో తీవ్ర రక్తస్రావమైంది. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.