News December 11, 2025

మెదక్: ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సందర్శన

image

మెదక్ జిల్లా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల సందర్బంగా పెద్ద శంకరంపేట, రేగోడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ‌భారతి లక్పతి నాయక్ ‌ సందర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. మొదటి విడత మాదిరిగానే రాబోయే రెండు, మూడు విడతల్లో పారదర్శకంగా పనిచేయాలన్నారు.

Similar News

News December 14, 2025

MDK: సమస్యాత్మక పోలింగ్ బూత్ పరిశీలించిన ఎస్పీ

image

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌గా గుర్తించిన రాజ్‌పల్లి పోలింగ్ బూత్‌ను మెదక్ జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విధులు నిర్వహించాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్‌ఐ శైలందర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 14, 2025

మెదక్ : పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

image

మెదక్ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. రాజ్‌పల్లి, చిన్న శంకరంపేట్, నార్సింగి, పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News December 14, 2025

మెదక్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ నమోదు

image

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు సగటున 21.83 % పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా ఓటింగ్ శాతం ఇలా ఉంది. తూప్రాన్ 25.49 %, మనోహరాబాద్ 23.03 %, చేగుంట 19.52 %, నార్సింగి 18.04 %, రామాయంపేట్ 22.14 %, నిజాంపేట్ 18.56 %, చిన్నశంకరంపేట్ 20.85 %, మెదక్ 27.99 % పోలింగ్ నమోదైంది.