News February 26, 2025
మెదక్: ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: SP

మెదక్ జిల్లాలో ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు.
Similar News
News February 26, 2025
మెదక్: మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

మెదక్ జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తుల గడువు మార్చి 10 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. https: //telanganams.cgg.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 26, 2025
మెదక్: MLC ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు

శాసనమండలి ఎన్నికల కోసం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 27న జరిగే ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇద్దరు డీఎస్పీలు, 7 ఎస్ఐలు, 41మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, 106 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 18 మంది హోం గార్డులు, మొత్తం 174 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాలో మొత్తం 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
News February 26, 2025
మెదక్ జిల్లాలో ఇంటర్ విద్యార్థులు 14,224 మంది

మెదక్ జిల్లాలో 14,224 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన ఆయా శాఖల అధికారులతో కలిసి ఇంటర్మీడియట్, 10వ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.