News March 7, 2025

మెదక్: ఎమ్మెల్సీ కవితపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్

image

మెదక్ ఎంపీ రఘునందన్ రావు గజ్వేల్ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవితపై ఫైర్ అయ్యారు. బీసీలకు అన్యాయం జరిగిందని కవితమ్మ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. కవిత నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయన కేసీఅర్‌తో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్ర కులం అధ్యక్ష పదవి బీసీ వ్యక్తికి ఇప్పించాలని అన్నారు. శాసనసభ, శాసన మండలిలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు

Similar News

News December 22, 2025

మెదక్: 492 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

image

మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు నిర్వహించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిని (ఆథరైజ్డ్ ఆఫీసర్) నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 492 గ్రామ పంచాయతీలకు ఆథరైజ్డ్ ఆఫీసర్లను నియమించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మొదటి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.

News December 22, 2025

రేపటి సర్పంచుల బాధ్యతల స్వీకరణకు ఏర్పాట్లు

image

తూప్రాన్ మండలంలో రేపు సోమవారం నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో నూతన సర్పంచులు, వార్డు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం, బాధ్యతలు స్వీకరణ చేయనున్నారు. అందుకు గ్రామపంచాయతీలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలతో అలంకరణ చేస్తున్నారు.