News April 10, 2024
మెదక్: ఏడు చెక్ పోస్టుల్లో రూ. 21.27 లక్షలు సీజ్

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పోలీసు చెక్ పోస్టుల్లో ఎలాంటి ఆధారాలు లేని రూ. 21,27,330 సీజ్ చేసినట్లు ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. అలాగే రూ. 17,06,600 విలువగల ఫ్రీ బీస్, రూ.9,75,800 విలువైన 2535.800 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నట్లు వివరించారు. వీటిని ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీకి అప్పగించినట్లు వివరించారు.
Similar News
News July 5, 2025
పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం, వసతి సౌకర్యాలపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News July 4, 2025
మెదక్ పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా బాలయ్య నియామకం

మెదక్ పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా న్యాయవాది బాలయ్య నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్పెషల్ పీపీగా నియమితులైన బాలయ్యను మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు మర్కంటి రాములు, కార్యదర్శి శిరిగా కరుణాకర్, ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
News May 8, 2025
మెదక్: జాతీయ లోక్ అదాలత్‌పై సమావేశం

మెదక్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం. సుభవల్లి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్స్, పోలీస్ ఆఫీసర్లు, బ్యాంక్ మేనేజర్స్, ఇన్సూరెన్స్ అడ్వకేట్లు పాల్గొన్నారు. జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ కేసులను ఎక్కువ సంఖ్యలో పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జడ్జి సిరి సౌజన్య పాల్గొన్నారు.