News March 14, 2025

మెదక్: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుండి 26 వరకు(థియరీ) నిర్వహిస్తున్నట్లు మెదక్ డీఈఓ ప్రొ. రాధాకిషన్ తెలిపారు. 26 నుంచి మే 3 వరకు ఇంటర్మీడియట్(ప్రాక్టికల్) పరీక్షలు ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30గం. నుంచి 5:30 వరకు ఉంటాయన్నారు. పరీక్ష రుసుము చెల్లించిన వారు ఈ పరీక్షలు రాయడానికి అర్హులని చెప్పారు.

Similar News

News March 14, 2025

మెదక్: పండగ పూట విషాదం.. యువకుడి ఆత్మహత్య

image

 పెళ్లి సంబంధాలు కుదరడంలేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. చిన్నశంకరంపేట మండలం మడూరుకు చెందిన ఫిరంగళ్ల శివరాజ్(24) గురువారం రాత్రి పొలానికి నీళ్లు చూడడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శివరాజు తండ్రి యాదగిరి పొలం వద్దకు వెళ్లి చూడగా వేప చెట్టుకు ఉరివేసుకొని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసుల విచారణ చేపట్టారు.

News March 14, 2025

మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

image

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.

News March 14, 2025

ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయండి: SP

image

మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు
ప్రశంసాపత్రాలు అందించారు.

error: Content is protected !!