News December 10, 2025

మెదక్: ఓటేయాలంటే గుర్తింపు కార్డు పక్కా !

image

ఓటర్లు తమ గుర్తింపు కోసం EPIC కార్డు (ఓటరు ఐడి) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ​ఆధార్ కార్డు, ​పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ​పాన్ కార్డు, ​బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్(ఫోటోతో), ​రేషన్ కార్డు(ఫోటోతో), ​పట్టాదారు పాస్‌బుక్, ​MNREGA జాబ్ కార్డు, ​దివ్యాంగుల ధృవీకరణ పత్రం(ఫోటోతో), ​పెన్షన్ పత్రాలు మొదలగునవి చూయించాలి.

Similar News

News December 14, 2025

ఉగ్రవాదాన్ని సహించబోం.. సిడ్నీ అటాక్‌పై మోదీ

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో జరిగిన <<18561798>>కాల్పుల<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజంపై చేసే పోరాటానికి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాగా కాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు. ఓ దుండగుడు హతమవ్వగా, పట్టుబడిన వ్యక్తి నవీద్ అక్రమ్‌గా గుర్తించారు.

News December 14, 2025

టాస్‌తో వరించిన విజయం.. అడవి లింగాల సర్పంచ్‌గా మంగలి సంతోష్

image

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అడవిలింగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన మంగలి సంతోశ్ కుమార్, పెంట మానయ్యాకు 483 ఓట్లు సమానంగా వచ్చాయి. టాస్ వేయడంతో మంగలి సంతోష్ కుమార్ గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో గ్రామస్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

News December 14, 2025

రాయికోడ్: 4 ఓట్లతో WIN

image

రాయికోడ్ మండలంలో ఎన్కెపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా BRS బలపరిచిని అభ్యర్థి బేగరి ఈశ్వరమ్మ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మానమ్మా మీద 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.