News February 27, 2025

మెదక్: ఓటేయాలనే సంకల్పం.. వాకర్‌తో పోలింగ్ కేంద్రానికి

image

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు మనకు తెలిసిందే. గురువారం ఎమ్మెల్సీ ఎన్నిక సందర్బంగా మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఒకరు వచ్చారు. ఆయన తీవ్ర మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా.. వాకర్ సాయంతో క్యూ లైన్‌లో నిలబడి ఓటు వేసి వెళ్లారు. దీంతో అయన సంకల్పానికి శభాష్ అంటున్నారు.

Similar News

News December 22, 2025

మెదక్: భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

image

భూ భారతి దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించాలని, అధికారులు సమయ పాలనా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు తప్పని సరిగా సమయ పాలనా పాటించాలన్నారు. కార్యాలయాలలో తప్పకుండా హాజరును నమోదు చేయాలన్నారు.

News December 22, 2025

మెదక్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News December 22, 2025

మెదక్: నేడు కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం

image

మెదక్ జిల్లాలోని 492 గ్రామ పంచాయతీల్లో సోమవారం నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. ఎన్నికలు జరగక నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఏర్పడింది. సుమారు రూ.50 కోట్లకుపైగా నిధులు రానుండటంతో పల్లె పాలన మళ్లీ గాడిలో పడనుంది.