News February 17, 2025
మెదక్: కలుసుకున్న 1972 ఇంటర్ మొదటి బ్యాచ్

మెదక్ పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి బ్యాచ్(1972) చదువుకున్న వారంతా ఆదివారం కలుసుకున్నారు. ఇందులో కొందరు చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. సరోజిని దేవి విద్యాసంస్థల ఛైర్మన్ ఆర్. జనార్ధన్ రెడ్డి, రిటైర్డ్ TSPCDL డైరెక్టర్ తౌట శ్రీనివాస్, వివి సిల్క్స్ వనపర్తి వెంకటేశం, అల్లెంకి సుదర్శనం, వెంకటేశం, మేడిశెట్టి కుమార్, STO జగన్నాథం, డా. రామరాజు, క్రిష్ణయ్య తదితరులున్నారు. వారంత ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
Similar News
News March 13, 2025
మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
News March 13, 2025
సాగునీటిపై రైతుల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్

వరి పంటకు సాగునీటి విషయమై రైతుల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కౌడిపల్లి మండలం మమ్మద్ నగర్ గ్రామ శివారులో వ్యవసాయ నీటి వనరులను పరిశీలించారు. గతేడాది యాసంగిలో పంటల పరిస్థితి ఎలా ఉంది. ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారు. తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ప్రస్తుత వరి పంట సాగునీరు అందే పరిస్థితి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
News March 13, 2025
మెదక్: గ్రూప్- 2 మహిళా విభాగంలో సుస్మితకు 2వ ర్యాంకు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందిన బాయికాడి సుస్మిత గ్రూప్-2 మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించింది. టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో ఆమె 406.5 మార్కులు పొందింది. అలాగే గ్రూప్-1 ఫలితాల్లో సైతం 401 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఆమె కొల్చారం గురుకులంలో పీజీటీ(గణితం)గా పని చేస్తుంది. ఈ ర్యాంకుల ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.