News March 28, 2024
మెదక్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు

మెదక్ పార్లమెంటు స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముందుగా ప్రకటించగా.. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రకటించింది. చిట్ట చివరకు రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ పేరును ప్రకటించింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో ప్రచారం జోరందుకోనుంది.
Similar News
News October 24, 2025
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్: మెదక్ కలెక్టర్

భూభారతి దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించడానికి జిల్లాలో నవంబర్ 1 వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పది రోజుల్లో సుమారుగా వెయ్యి భూభారతి దరఖాస్తులు పరిష్కరిస్తామన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా కలెక్టర్ ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రతిరోజు ఒక్కో తహశీల్దార్ పది ఫైల్స్ క్లియర్ చేసి ఆర్డీవోలకు పంపించాలని తెలిపారు.
News October 24, 2025
అన్ని శాఖల అధికారులు ఫైల్స్ ఈ-ఆఫీసులోనే పంపాలి: మెదక్ కలెక్టర్

అన్ని శాఖల అధికారులు ఫైల్స్‌ను ఈ- ఆఫీసులోనే పంపాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,031 ఫైల్స్‌ను ఈ-ఆఫీసులో క్లియర్ చేశామన్నారు. మెదక్ జిల్లాలో అన్ని శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి, ఫైల్స్‌ను ఎవరూ కూడా తారుమారు చేయడానికి వీలు లేకుండా ప్రతిష్ఠాత్మకంగా ఈ-ఆఫీస్ ప్రారంభించి అమలు చేస్తున్నామన్నారు.
News October 24, 2025
మెదక్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే

మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఈరోజు అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి మెదక్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రోడ్లు, కాలువలు, హాస్పిటల్, ఇళ్లు, పర్యావరణ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.


