News April 15, 2025

మెదక్: కొడుకుతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

image

కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. ఎస్ఐ లింగం వివరాలు.. నర్సాపూర్‌కు చెందిన మన్నె జయమ్మ నాలుగేళ్ల కొడుకుతో రాయరావు చెరువులోకి దిగుతుండగా వాచ్‌మెన్ రమేశ్ గమనించి విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి తల్లి, కొడుకును రక్షించి PSకు తరలించారు. కుటుంబ కలహాలతోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని జయమ్మ తెలిపిందని ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News April 16, 2025

కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు ఎడారి: హరీశ్ రావు

image

వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పొలాలు తడారిపోతున్నాయని.. ప్రజల బతుకులు ఎడారి అయిపోతున్నాయని ఆవేదన చెందారు.

News April 16, 2025

మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ

image

మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ అయ్యారు. మెదక్ జిల్లాకు కొత్త న్యాయమూర్తిగా జగిత్యాల జిల్లా నుంచి నీలిమ రానున్నారు. ఇక్కడి నుంచి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయ్యారు. లక్ష్మి శారదా ఇక్కడ 2022 జూన్ 2 నుంచి పనిచేస్తున్నారు. లక్ష్మి శారదా హయాంలో 2వ అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన, కొత్త కోర్టులు మంజూరు చేయించారు.

News April 16, 2025

రామాయంపేటలో వడదెబ్బతో వృద్ధుడి మృతి

image

వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(82) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కూడా పనికి వెళ్లారు. తిరిగి వచ్చిన ఆయన నీరసంగా ఉందని ఇంట్లోనే ఉన్నాడు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

error: Content is protected !!